హ్యూమన్ రైట్స్ న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ సీనియర్ జర్నలిస్టుగా అబ్దుల్ రజాక్ నియామకం

0
56

హ్యూమన్ రైట్స్ న్యూస్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ గడ్డం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అబ్దుల్ రజాక్ ( ది గోదావరి మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్) గారికి సీనియర్ జర్నలిస్టుగా నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మరియు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ అయిన ముప్పాల సుబ్బారావు గారి చేతుల మీదుగా ప్రెస్ ఐడి కార్డ్ ని అందించడం జరిగింది. ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు గారు మాట్లాడుతూ మెరుగైన సమాజం కోసం జర్నలిజం దోహదపడుతుందని హ్యూమన్ రైట్స్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కలిగే విధంగా పాటుపడాలని ప్రజల సమస్యలపై అధికారులకు తెలియపరచి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా పాటుపడాలంటూ మెరుగైన జర్నలిజం కోసం కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.