హమ్మయ్య పందుల బెడద తప్పుతొంది.…

0
37

ఆంధ్రప్రదేశ్/ తూర్పు గోదావరి జిల్లా / రాజమహేంద్రవరం రూరల్/ హుమన్ రైట్స్ న్యూస్ టుడే:

వేమగిరిలో సర్వత్రా హర్షం….

పందుల పట్టడాన్ని ఆపాలని వేమగిరికి చెందిన లారీ యూనియన్ నేత ఒత్తిడి తేవడం పై వ్యక్తం అవుతున్న ఆగ్రహం… జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేమగిరిలో పందుల కట్టడికి గ్రామపంచాయతీ నడుంబిగించింది. తమిళనాడు నుండి 25 మంది తో పందుల వేట ప్రారంభించింది. పందుల స్టైర్యవిహారంతో వేమగిరి గ్రామస్థులు గత కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పందుల పెంపక పరిశ్రమగా వేమగిరి మారడంతో వందల్లో గుంపులు గుంపులుగా తయారయ్యాయి. ఇవి పర్యావరణాన్ని కలుషితం చేయడంతో గ్రామంలో అంటువ్యాధులు పెరిగిపోయాయి. పందులను అరికట్టాలని కొన్ని వేల అర్జీలు అధికారులకు అందాయి ఎట్టకేలకు పందుల కట్టడి జరుగుతుంది. ఇలాంటి తరుణంలో టీడీపీ కి చెందిన లారీ యూనియన్ నేత ఒకరు పందుల పెంపకం దార్లకు వత్తాసు పలుకడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అతని తీరుపై గ్రామంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…