సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

0
20

అయినవోలు ఎస్ఐ జి వెంకన్న ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

హ్యూమన్ రైట్స్ న్యూస్/వరంగల్: కొండపర్తి గ్రామం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో అయినవోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్సై జి. వెంకన్న ఆధ్వర్యంలో సైబర్ నేరాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ సైబర్ నేరాలు ఈవ్ టీజింగ్ బాల్య వివాహాలు డాగ్స్ మాదకద్రవ్యాలు అలవాట్లకు గురి కాకూడదు అని సూచించారు. ఒకవేళ ఇలాంటి అలవాట్లకు ఎవరైనా పాలు పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సమాచార రక్షణ హక్కు చట్టం( 2005) వరంగల్ జిల్లా అధ్యక్షులు బర్ల శ్రావణ్ మాట్లాడుతూ సైబర్ నేరాలకు పాల్పడితే శిక్షలు ఉంటాయని వివరించారు. కొండపర్తి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ నైతిక విలువలను సామాజిక అంశాలను విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి హెచ్ ఎస్ హెడ్మాస్టర్ పద్మలత మేడం మరియు టీచర్లు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎస్ ఐ వెంకన్నకి పుష్ప గుచ్చం అందించి శాలువతో సత్కరించారు.