సీఐటీయూ మారేడుమిల్లి మండల మహాసభ నూతన కమిటీ ఎన్నిక

0
79

ఆంధ్రప్రదేశ్/ అల్లూరి సీతారామరాజు జిల్లా /మారేడుమిల్లి / టుడే న్యూస్: సిఐటియూ మారేడుమిల్లి మండల నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం సి ఐ టి యు జిల్లా నాయకురాలు మట్ల.వాణిశ్రీ అధ్యక్షతన జరిగింది సీఐటియూ మండల అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్ రత్నకుమారి బి.దాసులు ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా జి జగన్ సహాయ కార్యదర్శిగా జి కిషోర్ ట్రెజరర్ గా ఈ సిరిమల్లె రెడ్డి, మరో 12 మంది సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా జరిగిన మహాసభలో సిఐటియు జిల్లా నాయకులు ఎం వాణిశ్రీ, పి రామరాజులు మాట్లాడుతూ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరిస్తున్నాయని కార్మికుల హక్కులను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు, కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు వారి సమస్యలను గాలికి వదిలేసి బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు,కనీస వేతనాలు అమలు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం స్కీం వర్కర్లు ఐక్యంగా ఉద్యమించాలన్నారు, మండలంలో నెలకొన్న అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీ పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.