సంపాదకుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతా ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని

0
42

ఆంధ్రప్రదేశ్ / అమరావతి/ హ్యూమన్ రైస్ టుడే న్యూస్ డెస్క్ ఇంచార్జ్

స్థానిక పత్రికల సంపాదకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి మేలు జరిగేలా చూస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

శుక్రవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్
రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు,ప్రధాన కార్యదర్శి పట్నాల సాయికుమార్ ల ఆధ్వర్యంలో సంఘ నాయకులుఅకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ ను కలిసి స్థానిక పత్రికల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ
పత్రికా నిర్వహణ కష్టసాధ్యమని తనకు తెలుసునని సంపాదకుల సమస్యలను తప్పనిసరిగా ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు.
అయితే ప్రెస్ అకాడమీకి కొన్ని పరిధిలు ఉన్నాయని వాటికి లోబడి తాను తన సహాయ సహకారాలను అందిస్తానని స్పష్టం చేశారు.ముఖ్యంగా పాత్రికేయులు వృత్తిపరమైన స్ట్రెస్ కు లోనవ్వకుండా
ప్రముఖ మానసిక వైద్యులు ఇండ్ల సుబ్బిరామిరెడ్డి తో సలహాలు ఇప్పిస్తున్నామని చెప్పారు
అకాడమీ చైర్మన్ ను సత్కరించిన ఏపీఈఆర్ యు నాయకులు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కొమ్మినేని శ్రీనివాస్ ను తొలుత
ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ నాయకులు శాలువాతో సత్కరించి యూనియన్ జ్ఞాపికను అందజేశారు.
అలాగే సంపాదకుల సమస్యల వినతి పత్రాన్ని ఇచ్చారు.
రాష్ట్ర అధ్యక్షులు సాంబశివ నాయుడుతో పాటు ప్రధాన కార్యదర్శి సాయికుమార్,ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఖలీల్ రెహమాన్,అమరావతి అధ్యక్షులు ఉమాయూన్
ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్,
గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సాగర్ బాబు తదితరులు ప్రెస్ అకాడమీ చైర్మన్ కలిసిన వారిలో ఉన్నారు.