శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి ఆధ్వర్యంలో గిరిజనులకు దుప్పట్లు పంపిణీ

0
25

ఆంధ్రప్రదేశ్/తిరుపతి జిల్లా/గూడూరు మండలం/హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి :

చిల్లకూరు మండలం,కాకు వారి పాళెం గిరిజన కాలనీల్లో దుప్పట్లు పంపిణీ 100 దుప్పట్లు అందజేసిన చైర్మైన్ అల్లం రమణయ్య దాతలు నెల్లూరుకు చెందిన కె.సాయి సుకేష్ రాజు,అంజనీ వర్మ దంపతుల దాతృత్వంలో కె.సాయి సుకేష్ రాజు,అంజనీ వర్మ ల కుమార్తె సాయి తనుష్క వర్మ జన్మదినం సందర్భంగా దాతల దాతృత్వం అపూర్వం:అల్లం రమణయ్య కోట పట్టణానికిచెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి ఆధ్వర్యంలో నెల్లూరుకు చెందిన కె.సాయి సుకేష్ రాజు,అంజనీ వర్మ దంపతుల కుమార్తె సాయి తనుష్క వర్మ జన్మదినం సందర్భంగా తాత,అమ్మమ్మ రాజశేఖర వర్మ దాతృత్వంలో గురువారం చిల్లకూరు మండలం ,కాకు వారి పాళెం గిరిజన కాలనీ లో 100 మంది నిరుపేద గిరిజన కుటుంబాలకు చలికాలంగా దుప్పట్లు చైర్మైన్ అల్లం రమణయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అల్లం రమణయ్య మాట్లాడుతూ చలికాలంలో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనీ గుర్తించి వారికి నెల్లూరుకు చెందిన కె.సాయి సుకేష్ రాజు,అంజనీ వర్మ దంపతుల కుమార్తె సాయి తనుష్క వర్మ జన్మదినం సందర్భంగా దుప్పట్లు అందజేసినట్లు తెలిపారు. తమ సంస్థకు ఎల్లవేళలా దాతలు అండగా నిలవడంతో తాము నిరంతరం సేవాకార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ షిర్డీసాయి అక్షయ సేవాసమితి సభ్యులు అవుల సుబ్బయ్య,పన్నగ సాయి,గిరిజనులు తదితరులు ఉన్నారు.