వీధిన పడ్డ వృద్ధురాలు

0
29

ఆంధ్ర ప్రదేశ్/తిరుపతి జిల్లా/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి :

భర్త మరణాంతరం తో పెద్ద కొడుకు చెంతన నున్న వృద్ధురాలు కొడుకు మరణాంతరం ఆస్తి వ్యవహారంలో జరిగిన మోసం తెలియగానే దిక్కు తోచని పరిస్థితిలో రాజేశ్వరమ్మ

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని వెంగారెడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన రాజేశ్వరమ్మ రెవెన్యూ కార్యాలయంలో ఎమ్మార్వో వద్ద తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని న్యాయం చేయమంటూ వేడుకుంది
రాజేశ్వరమ్మ భర్త వెంకట సుబ్బారెడ్డి మరణాంతరం పెద్ద కొడుకు అయిన రవీంద్ర రెడ్డి వద్దనే ఉంటూ ఉండేది కొడుకు బతికున్నంత కాలం కొడుకు దగ్గరే ఉంటూ తన భర్త పేరుపై నున్న దాదాపు 5 ఎకరాల భూమిని తన పెద్ద కుమారుడు అనుభవిస్తూ ఉండేవాడని కొడుకు కూడా మరణించడం తో అసలు విషయం తెలిసిందని నా భర్త మరణాంతరం ఆయన భార్యగా నాకు చెందవలసిన ఆస్తిని నాకు తెలియకుండా నా పెద్ద కుమారుడు అతని పేరుపై చేసుకున్నాడని నా పెద్ద కుమారుడు తరువాత ఆ ఆస్తి నా పెద్ద కోడలు పేరుపై మార్చారని ప్రస్తుతం తనను ఇంటిలో నుంచి గెంటేశారని నిస్సహాయ స్థితిలో ఉన్నానని వరదయ్యపాలెం ఎమ్మార్వో వద్ద మొరపెట్టుకకుంది
రాజేశ్వరమ్మకు ఇద్దరు కుమారులు ఓ కుమార్తె ఇద్దరు కుమారులు కూడా మరణించడంతో ఓవైపు భర్త లేక మరోవైపు ఇద్దరు కొడుకులు మరణించి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తనకు న్యాయం చేయాలన తను ప్రస్తుతం కూతురు వద్ద తలదాచుకుంటున్నానని తన భర్త మరణాంతరం తనకు చెందవలసిన ఆస్తి తన అనుమతి లేకుండా తనకు తెలియకుండా ఇలా జరిగిన వైనంపై విచారణ జరిపించాలని న్యాయం చేయాలని కోరిన రాజేశ్వరమ్మ
ఎమ్మార్వో గౌరీ శంకరరావు మాట్లాడుతూ రాజేశ్వరమ్మ ఫిర్యాదు అందిన వెంటనే నోటీసులు పంపామని కచ్చితంగా రాజేశ్వరమ్మకు తగు న్యాయం చేస్తామని దీనిపై విచారణ ఉంటుందని తెలిపారు
ఏది ఏమైనా
తండ్రి మరణం తర్వాత ఆయన పేరు మీద ఉన్న ఆస్తి సహజంగా భార్యకు చెందుతుంది కానీ రాజేశ్వరమ్మ అభియోగిస్తున్నట్లు తనకు ఏ విషయం తెలియదని ఈ పరిణామం ఎలా జరిగిందని ఆమె చెబుతున్న విధంగా చూస్తే అసలు ఓ వ్యక్తి చనిపోతే అతనికి ముగ్గురు పిల్లలు ఉంటే ఒక కుమారుడికి ఆస్తి ఎలా చెందుతుంది మిగిలిన ఇంకో కుమారుడు కూతురు పరిస్థితి ఏంటి ఏ ఆధారాలు చూపించి తన తండ్రి ఆస్తి యావదాస్తిని తన పేరుతో పెద్ద కుమారుడు చేసుకోగలిగాడు తరువాత కాలంలో తన భార్యపై ఎలా చేశాడు అసలు తన తండ్రి ఆస్తి తన పేరుపై మార్చుకున్న తర్వాత తన భార్యకు రాసిచ్చాడా లేక ఆ క్రమంలోనే తన భార్యపై కొంత తనపై కొంత చేసుకున్నాడా ఈ విషయాలన్నీ అధికారుల విచారణలో తేలాల్సింది