ఆంధ్ర ప్రదేశ్ /అన్నమయ్య జిల్లా/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ :
రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో నిన్న జరిగిన జాబ్ మేళా కు కోడూరు పరిసర ప్రాంతాల నిరుద్యోగులు 182 మంది జాబ్ మేళా కు హాజరు కాక అందులో 53 మంది అభ్యర్ధులు సెలక్టు అయినారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం శ్రీలత తెలిపారు ప్రిన్సిపాల్ సెలక్ట్ అయిన వారినందరినీ అభినందించి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు కన్స్ట్రెంటిక్స్ కంపెనీ కు 7 మంది,ముత్తూట్ ఫైనాన్స్ కు 5 మంది, హెటిరో డ్రగ్స్ కు 7 మంది, టిసియల్ కంపెనీ కు 7 మంది త్రూనే టెక్నో 23 మంది నీ నియామకం చేయడం జరిగింది అని ప్రిన్సిపాల్ డాక్టర్ యం శ్రీలత తెలిపారు