రాయితీ రుణాలపై అవగాహన సదస్సు

0
81

ఆంధ్రప్రదేశ్/అన్నమయ్య జిల్లా/రైల్వే కోడూరు మండలం/ హ్యూమన్ రైస్ టుడే న్యూస్

చేతివృత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు రాయితీ రుణాలు పొందేందుకు సహకరిస్తామని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం కడప డైరెక్టర్ ఎన్ నారాయణరెడ్డి అన్నారు

నాబార్డ్ వారి సహకారంతో గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక గిరిజమ్మ వీధిలోని మగ్గం వర్క్ శిక్షణా కేంద్రంలో ఈరోజు ఆయన రాయితీ రుణాలపై మహిళలకు అవగాహనకలిగించారు మగ్గం వర్క్ అనేది ఇప్పట్లో మంచి డిమాండ్ ఉన్న చేతి వృత్తి అని శిక్షణ పొందిన మహిళలు అధునాతన డిజైన్ ల ద్వారా అధిక ఆదాయంపొందవచ్చునన్నారు ప్రధానమంత్రి స్వయం ఉపాధి కల్పనా పథకం ద్వారా 35% సబ్సిడీతో రుణాలు పొందవచ్చునన్నారు అదేవిధంగా ముద్ర లోన్ ద్వారా చిన్నపాటి రుణాలతో యూనిట్లు ప్రారంభించుకోవచ్చును అన్నారు. పెద్దగా రుణం పొందాలి అనే ఆలోచన కన్నా ఎందుకు రుణం తీసుకోవాలి అనే దానిపై అవగాహన తీసుకున్న రుణం సక్రమంగా తీర్చే విధంగా ప్రణాళిక ఉండాలన్నారు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం కడప నందు సోమవారం నుండి పురుషులకు ఏసీ మెకానిక్ మరియు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నందు నెలరోజులపాటు భోజన వసతితో కూడిన ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందని 18 నుండి 45 సంవత్సరాల లోపు వారు ఈ శిక్షణ పొందవచ్చునన్నారు ఆసక్తి గలవారు స్థానిక గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ కార్యాలయంలో లేదా కడప శిక్షణా కేంద్రంలో దరఖాస్తులు పొందవచ్చునన్నారు అనంతరం ఆర్ సి టి డైరెక్టర్ ఎన్నా రాయణరెడ్డిని ట్రస్ట్ చైర్మన్ కె పార్థసారథి మహిళలు మెమెంటో తో సత్కరించారు కె, పార్థసారధి చైర్మన్ గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ రైల్వే కోడూరు