యూనివర్సిటీ వీసీ పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి:PDSU

0
21

గర్ల్స్ హాస్టల్ లో చిందులు వేస్తూ అక్రమ సంపాదనను పంచిన యూనివర్సిటీ వీసీ పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి : PDSU

హ్యూమన్ రైట్స్ న్యూస్ /నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్స్ లో చిందులు వేస్తూ యూనివర్సిటీ లో అక్రమంగా సంపాదించిన డబ్బులను పంచిన యూనివర్సిటీ వీసీ పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు జన్నారపు రాజేశ్వర్, వసరి సాయినాథ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా PDSU, PYL ఆధ్వర్యంలో డిచ్ పల్లి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించటం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో అనేక సమస్యలపై అదేవిధంగా వీసీ అవినీతిపై మొన్న జరిగిన బాలికల హాస్టల్లో డబ్బులు పంచుతూ విసి డ్యాన్స్ చేయడాన్ని ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘ నాయకుల పైన కేసులు బనాయిస్తూ చర్యలు తీసుకుంటామని పేపర్ ప్రకటనలు ఇస్తూ సెమిస్టర్ పరీక్షల జరుగుతున్న సమయంలో విద్యార్థి నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, యూనివర్సిటీ లో విద్యార్థి నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకున్న ఊరుకునేది లేదని, గతంలోనే అక్రమ పద్దతిలో 130 పోస్టులు నింపి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసారని, యూనివర్సిటీ ఖజానాను వీసీ ఖాళీ చేసారని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అవినీతి వీసీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. PDSU ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఈరోజు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో PDSU డివిజన్ అధ్యక్షుడు వరుణ్,నాయకులు శంకర్, శ్రీజ, సిద్దు, సంతోష్, రమ్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు.