మత సామరస్యం చాటిన ఎం.ఏ.మాజీద్

0
192

మత సామరస్యం చాటిన డీపీఆర్వో సీనియర్ అసిస్టెంట్ ఎం.ఏ.మాజీద్

హ్యూమన్ రైట్స్ టుడే /నిజామాబాద్, సెప్టెంబర్ 08 : వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని పలువురు సర్వమత సమానత్వాన్ని ఆచరణాత్మకంగా నిరూపిస్తుండడం విశేషం.
ప్రతీ యేటా వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేష్ మండలి వద్ద ప్రతి రోజు దాతలు అన్నదానం నిర్వహించారు.ఇందులో భాగంగా విషయం తెలిసిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ ఎం.ఏ.మాజీద్ స్వచ్చందంగా ముందుకు వచ్చారు. గణేష్ మండలి వద్ద గురువారం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచిందని జర్నలిస్టులు మాజీద్ ను అభినందిస్తూ, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. గత ఏడాది సైతం లడ్డువేలం పాటలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జర్నలిస్టులు, స్థానికులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.