బాలునాయక్ చారిటబుల్ ట్రస్ట్ మరియు గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

0
39

హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా బాలునాయక్ చారిటబుల్ ట్రస్ట్ మరియు గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మహబూబాబాద్ లోని స్థానిక సలార్ తండా లోని నిరుపేదలకు బియ్యం కూరగాయలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.
బాలునాయక్ చారిటబుల్ ట్రస్ట్ మరియు గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్, ప్రొఫెషనల్ మల్టీ పర్పస్ సోషల్ వర్కర్ మహాత్మాగాంధీ జాతీయ అవార్డు గ్రహీత, మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు గ్రహీత, లైఫ్ టైం గోల్డెన్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత, నేషనల్ యూనిటీ అవార్డు గ్రహీత, వరంగల్ జిల్లా బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు గ్రహీత, ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత,
భూక్య బాలునాయక్ Contested M.P & M.L.A. Mahabubabad Constuency, పాల్గొని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో మహబూబాబాద్ లోని 7 వ వార్డు సలార్ తండా లొ నిరుపేదలకు అనాధలకు వితంతువులకు వృద్ధులకు వికలాంగులకు యాచకులకు బియ్యం కూరగాయలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే సమాజం మనుగడ సాధిస్తుందన్నారు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు దాతలు ముందుకు వచ్చి నిరుపేదలైన ప్రతి ఒక్కరిని, చాలీ చాలని జీవితము గడుపుతున్న వారిని ఆదుకోవాలని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి వారిలో వెలుగు నింపాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ జాతీయ ఉపధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సేవ రత్న అవార్డు గ్రహీత
గుగులోత్ వేణు గోపాల్ నాయక్, భూక్య స్వర్ణలత, భూక్య రాంబాబు నాయక్, భూక్య సురేష్ , గుగులోతు బాలు, డప్పు ప్రసాద్, గుగులోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు.