బాలల దినోత్సవ వేడుకల్లో ఏన్ యస్ రెడ్డి

0
45

ఆంధ్రప్రదేశ్/తిరుపతి జిల్లా/హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్/కోట మండల ప్రతినిధి

భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం బాల్యం

సెమ్స్ స్కూల్ లో ఘనంగా చిల్డ్రన్స్ డే
చిన్నారులకు నోట్ బుక్స్, పెన్సిల్స్, చాక్లెట్స్ పంపిణీ
అందరూ అనుభవించే బాల్యం భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం అని
ఎన్.యస్ రెడ్డీ అన్నారు.
స్థానిక శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో నెహ్రూ పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
చిన్నారులకు నోట్ బుక్స్, పెన్సిల్స్, చాక్లెట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా యన్.యస్.రెడ్డీ మాట్లాడుతూ
అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులని,
అందుకు సూచకంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవాలు జరుపుకుంటారని తెలిపారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారని మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటామని పేర్కొన్నారు. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుందని, నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారని అన్నారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారని, భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుందని గుర్తు చేశారు. శ్రీనివాసా స్కూల్ చైర్మన్ చంద్రసేన గారు మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి నవభారత నిర్మాతలు వారి బంగారు భవిష్యత్తుకు మనమంతా కలిసి పనిచేద్దాం అని అన్నారు. చిన్నారులకు బాలల దినోత్సవ శుభకాంక్షలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది రమా దేవి,సంధ్య, భాగ్యమ్మ, గీతా,శిరీషా, తిరపతిమ్మ, నిరుపా, నోనిక,అరుణ శ్రీ, అపర్ణ, మమతా,సుమలత తదితరులు పాల్గొన్నారు.