ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రోగ్రామ్ ద్వారా గ్రామాలలో విస్తృత వైద్య సేవలు
ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి

0
23

ఆంధ్రప్రదేశ్ /అన్నమయ్య జిల్లా/ నందలూరు/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి :

ప్రభుత్వ వైద్యాన్ని గ్రామీణ పేదల ముంగిట్లోకి తేవడానికి ఉద్దేశించిన ప్రభుత్వ ప్రతిష్టత్మక కార్యక్రమం ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రోగ్రామ్ ని అందరు సద్వినియోగం చేసుకొని ప్రతి వై యస్ అర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లో నెలకు రెండు సార్లు ఉచిత పరీక్షలు, మందులు, ఇతర వైద్య సేవలు పొందగలరని ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం లో భాగంగా ఎర్ర చెరువు పల్లి సచివాలయం పరిధిలో ఎర్ర చెరువు పల్లి, చెన్నయ్య గారి పల్లి, బాల కృష్ణ పురం లలో ఈ రోజు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలలో 78 రక్త పోటు, 53 మధుమేహం, 12 రక్త హీనత, 6 గర్భిణీలు మరియు 45 ఇతర జబ్బులకు రక్త పరీక్షలు, మందులు ఇవ్వడం జరిగిందని మరియు చెన్నయ్య గారి పల్లి మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు మరియు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వైద్యుడు తెలిపారు ప్రతి గ్రామ సచివాలయం ఏ న్ ఎం దగ్గర లేదా ఆశ కార్యకర్త దగ్గర రూట్ మ్యాప్ అందుబాటులో ఉంచామని, పౌరులు సంబంధిత తేదీలు తెలుసుకొని వారి సచివాలయం పరిధిలోనే వైద్య సేవలు నిర్నీత తేదీలలో పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమం లో 104 వైద్యురాలు ప్రియాంక, ఎం ల్ హెచ్ పి లక్ష్మి, ఏ న్ ఎం నాగ మణి , సుబ్బయ్య, ఆశలు పాల్గొన్నారు.