ప్రతి ఒక్కరూ వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా బాలల సంక్షేమ న్యాయమూర్తుల పీఠం చైర్పర్సన్ సూర్య ప్రభావతి

0
28

ఆంధ్రప్రదేశ్/ తూర్పుగోదావరి జిల్లా/ రాజమహేంద్రవరం/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి :

ప్రతి ఒక్కరూ వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా బాలల సంక్షేమ న్యాయమూర్తుల పీఠం చైర్పర్సన్ సూర్య ప్రభావతి ప్రతి ఒక్కరూ వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా బాలల సంక్షేమ న్యాయమూర్తుల పీఠం చైర్ పర్సన్ పేరిచర్ల సూర్య ప్రభావతి పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో వినియోగదారుల వారోత్సవాలను పురస్కరించుకొని రూపొందించిన మేలుకో వినియోగదారుడా మేలుకో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం రాజమహేంద్రవరం దానవాయిపేట లోని ఏపీ స్టేట్ హోం వద్ద ఘనంగా జరిగింది. మండలి అధ్యక్షులు, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు సుంకర వీరశేఖర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పేరిచర్ల సూర్య ప్రభావతి, సీడబ్ల్యుసీ సభ్యులు నాగేశ్వరరావు, మహాలక్ష్మి, అనంతలక్ష్మి ల చేతులమీదుగా కరపత్రాలు ఆవిష్కరించారు. మండలి సెక్రటరీ ధర్నాలకోట వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా సూర్యప్రభావతి మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల మండలి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. అందరూ చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి అభివృద్ధి పదంలో పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలి జనరల్ సెక్రటరీ యెరుసు పాండురంగ, సెక్రటరీ ధర్నాలకోట వెంకటేశ్వరరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ కూనరెడ్డి హేమంత్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాల్ ఆత్కూరి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.