పోగొట్టుకున్న 12 సెల్ ఫోన్ లను పట్టుకుని అప్పగించిన వన్ టౌన్ పోలీసులు

0
38

పోగొట్టుకున్న 12 సెల్ ఫోన్ లను సాంకేతిక పరిజ్ఞానంతో వెతికి తిరిగి వారికి అప్పగించిన వన్ టౌన్ పోలీసులు

హ్యూమన్ రైట్స్ టుడే: వివిధ ప్రాంతాలనుండి మహబూబ్ నగర్ కి తమ సొంత పనులపై వచ్చి,తమ యొక్క మొబైల్ ఫోన్ లను పోగొట్టుకొని, వాటినీ వెతికినా దొరకక ఏమీ చేయని పరిస్థితులలో 1టౌన్ పొలీస్ స్టేషన్ ని ఆశ్రయించిన 12మంది వ్యక్తులకి, సాంకేతిక పరిజ్ఞనాన్ని ఉపయోగించి, వాళ్ళు పోగొట్టు కున్న 12 మొబైల్ ఫోన్ లను వెతికి, వాటినీ వాళ్లకు ఈరోజు 1టౌన్ పొలీస్ స్టేషన్ లో అప్పగించిన ఒకటవ పట్టణ పోలీసులు. ఈ సంధర్భంగా సీఐ ఎస్ఐ 1టౌన్ మహబూబ్నగర్ మట్లాడుతూ వివిధ పనులకి బయటికి వెళ్లినప్పుడు గాని, మరియు కూరగాయలకు వెళ్లి నప్పుడు గాని, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ సెల్ పోన్ లను జాగ్రత్తగా ఉంచుకోవాలని మరియు అపరిచిత వ్యక్తులతో జగ్రత్తగ్గా ఉండాలని, ప్రజలను ఉద్దేశించి సూచించారు.