పత్రికల సంపాదకులు అందరికి స్టేట్ బస్ పాస్ ఇవ్వాలి: ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్

0
185

ఆంధ్రప్రదేశ్/ అమరావతి/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్/ ప్రతినిధి : స్థానిక మరియు వార, పక్ష, మాస (పిరియాడికల్) పత్రికల సంపాదకులు అందరికి స్టేట్ బస్ పాస్ ఇప్పించవలసిందిగా ఏపీఎస్ ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం యూనియన్ ప్రధాన న్యాయ సలహాదారులు హైకోర్టు అడ్వకేట్ నరహరిశెట్టి శ్రీహరి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు కార్యనిర్వాహక కార్యదర్శి సాయికుమార్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఖలీల్ రెహమాన్ లు కలిసి జిల్లా కేంద్రాలుగా పత్రికలను నిర్వహిస్తున్న సంపాదకులకు స్టేట్ బస్ పాస్ ఇవ్వాలని కోరారు. జిల్లా కేంద్రాల నుంచి పత్రికా నిర్వహణ పనిపై రాజధానికి వచ్చే సంపాదకులకు పాస్ లేకపోవడం వల్ల ఎంతో ఖర్చు అవుతుందని ఆందోళన చెందారు. స్టేట్ బస్ పాస్ ఉంటే సంపాదకులకు వార్తా సేకరణకు వెసులుబాటు ఉంటుందని వివరించారు. అలాగే ఉమ్మడి జిల్లా కేంద్రంగా పాసులను అప్డేట్ చేయాలని ఎండి ను సాంబశివ నాయుడు కోరారు. ఈ సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని సంపాదకులకు తప్పనిసరిగా న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఎండి ద్వారకా తిరుమల రావు హామీ ఇచ్చారు. రాష్ట్ర నాయకులు ద్వారకా తిరుమలలో శాలువాతో సత్కరించి యూనియన్ జ్ఞాపికను వినతి పత్రాన్ని అందజేశారు.