న్యూడ్ చాట్లకు ఆహ్వానిస్తారు.. వీడియోలు తీసి బెదిరిస్తారు తస్మాత్ జాగ్రత్త ..

0
483

సైబర్ క్రైమ్ బారిన పడ్డారా..? ఆన్లైన్లో మోసపోయారా..? వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు డయల్ చేయండి….
సైబర్ మోసగాళ్లు మీ డబ్బును దొంగలించిన మొదటి గంట లోనే మీరు 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయడం మర్చిపోకండి… ఫిర్యాదు చేస్తే…. మీ డబ్బు రికవరీ చేయడం సులభం.

న్యూడ్ చాట్లకు ఆహ్వానిస్తారు.. వీడియోలు తీసి బెదిరిస్తారు తస్మాత్ జాగ్రత్త ..

—– *ఎస్పి శరత్ చంద్ర పవార్ ips*

మహబూబాబాద్, హ్యూమన్ రైట్స్ టుడే: తెలంగాణ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (T4C) జూన్ 2021 నుండి 24/7 కాల్ సెంటర్ను నడుపుతోంది మరియు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ (1930)లో ప్రజల సైబర్ మోసం ఫిర్యాదులకు స్పందించడం జరుగుతుంది. ప్రజలు తమకు జరిగిన మోసాలను గుర్తించిన వెంటనే. మోసాన్ని నివేదించినట్లయితే, సైబర్ మోసగాళ్ళు చేతిలో మోసపోయిన డబ్బును వారి ఖాతాలలోని డబ్బును బ్లాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది సమయంపై ఆధారపడిన ప్రతిస్పందన కాబట్టి, ప్రజలు ఏదైనా అనుమానాస్పద లావాదేవీ/ మోసం జరిగినప్పుడు సమయాన్ని వృథా చేయకుండా1930 కి కాల్ చేసి లేదా NCRP లో
www.cybercrime.gov.in లో పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా కీలకం. చేతిలో మొబైల్ (Mobile) ఉంది కదా అని.. ఇష్టం వచ్చిన లింకులన్నీ ఓపెన్ చేస్తే మీ జీవితాలు తల్లకిందులు అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మొబైల్ లో ఇంటర్నెట్ వాడుకునేటప్పుడు.. మీ స్క్రీన్ మీద అనవసర లింక్లను పొరపాటున క్లిక్ చేయకుండా ఉండడమే మంచిది. తెలియక పొరపాటున ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు క్షణాల్లో మాయమవుతుంది. అంతేకాదు మీ మొబైల్లో ఉన్న ప్రైవేట్ డేటా మొత్తం సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. గుర్తు తెలియని నెంబర్ నుండి చాట్ చేసిన వీడియో కాల్ చేసిన స్పందించకండి తరువాత ఇబ్బందుల పాలు కావద్దు అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ IPS గారు సూచించారు.