నా కూతుర్ని ఐటీడీఏ పీవో నే బలి తీసుకున్నారు: మృతురాలి తండ్రీ

0
130

ఆంధ్రప్రదేశ్/ అల్లూరి సీతారామరాజు జిల్లా / చింతపల్లి/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ :
చింతపల్లి డిగ్రీ కాలేజీ ఎదురుగ ఉన్న ITDA కాఫీ పుల్ఫింగ్ విస్తరణ కొరకు తవ్వుతున్న ఆరుడుగుల గోతిలో నిండు ప్రాణం బలి ఐంది.

దీనికి కారణం ITDA P.O అంటున్న కన్న తండ్రి వివరాలికి వెళితే చెండా జీవిత D/O వీరన్న తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూనా కోరుకుంటున్న తండ్రి రోదిస్తున్న కుటుంబ సభ్యులు. ఈ కుటుంబం గత 20 సంవత్సరాలుగా చింతపల్లి రామాలయం వీధీ, నిమ్మగడ్డీ ఫ్యాక్టరీకీ మరియు ITDA కాఫీ పల్పింగ్ యూనిట్ కి మధ్య ఒక చిన్న గుడిసెలో కూలిపనులు చేసుకుంటూ తల్లీదండ్రులు మరియు ముగ్గురు పిల్లలు జీవిస్తున్నారు. అయితే ఒక 2 వారాల క్రితం వీళ్ళ గుడిసె దిగువన వున్నా ఖాళీ స్థలంలో చదును చేసి ఏదో నిర్మించడానికి పెద్ద పెద్ద పునాది గుంతలు తవ్వి వాటికీ ఎటువంటి హెచ్చరిక బోర్డులు కానీ, వాచిమేన్ కానీ లేకుండా నిర్లక్ష్యంగా వదిలేసారు. వర్షాకాలం కావడంతో గుంతల నిండా ఆరు అడుగుల మేర నీళ్ళు చేరాయీ… అయితే శనివారం 08-10-2022 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొందరు పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లి చెండా జీవిత అనబడే 4 వ తరగతి చదువుతున్న 9సంవత్సరాల బాలిక ఎంతో భవిష్యత్తు ఉన్న పాప పొరపాటున ఆ గుంతలో పడి చనిపోయింది. కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన భవన నిర్మాణ కాంట్రాక్టు పైన మరియు సంబంధిత అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే పాపను కోల్పోయిన కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆ కుటుంబం తరఫున ప్రజలు కోరుతున్నారు. అలాగే ఈ న్యాయబద్ధమైన డిమాండుకు DLO, DSO, JAC మరియు అన్ని గిరిజన సంఘాలు సహాకరించాలనీ కుటుంబ సభ్యులు మరియు ప్రజలు కోరుతున్నారు.