నందలూరు లో భూ కబ్జా పై ఆర్డీవో విచారణ

0
18

ఆంధ్ర ప్రదేశ్/అన్నమయ్య జిల్లా/నందలూరు మండలం/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ :

కబ్జాకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి
విఆర్వో వెంగయ్యపై ఆగ్రహం నందలూరు మండలం నేషనల్ హైవే సమీపంలో ని 1160-1 ఏ లోని 10 కోట్ల విలువ చేసే 4 ఎకరాల ప్రభుత్వ స్థలంను చదును చేసి కబ్జాకు గురి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కు మండల వైసీపీ నేతలు సిద్దవారం గోపీరెడ్డి, పల్లె నాగమొహన్ జిల్లా కలెక్టర్ గిరీష్ కు ఫిర్యాదు చేశారు.కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం రాజంపేట ఆర్డీవో కోదండ రామి రెడ్డి కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు ఆయన వెంట స్థానిక రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.గతంలో నాటిన బోర్డు లేకపోవడం తో మరో ప్రింటింగ్ ఫ్లెక్సీ బోర్డును రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ స్థలమని బోర్డు ఏర్పాటు చేశారు.

వీఆర్వో వెంగయ్య పై ఆర్డీవో ఆగ్రహం

నందలూరు వీఆర్వో వెంగాయ్య పరిధిలో భూకబ్జా జరుగుతుంటే ఏం చేస్తున్నావని విఆర్వో పై ఆర్డీవో కోదండ రామి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకబ్జాకు పాల్పడిన వారిని గుర్తించి వివరాలు తెలిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విఆర్వోను ఆదేశించారు ఇందులో వీఆర్వో ప్రమేయం ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.