దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

0
22

దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి: యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ డిమాండ్

హ్యూమన్ రైట్స్ న్యూస్/ఏపీ: ఇటీవల కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన యాదవ కుటుంబీకులు దేవర శ్రీనుబాబు, దేవర అప్పలరాజు మరియు వారి కుటుంబానికి చెందిన వారి పై అమానుషంగా దాడి చేసిన రాయి చిట్టిబాబు, రాయి తిరుపతి రావు, రాయి రాణీ బాబు, దాట్ల అప్పన్నబాబు లను వెంటనే అరెస్ట్ చేసి చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుర్రా శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చoద్ర ప్రసాద్ ని శంఖవరం ఆయన స్వగృహంలో స్థానిక యాదవ సంఘ నాయకులతో పాటు బాధితుల్ని కూడా వెంట బెట్టుకుని కలిసి విజ్ఞప్తి చేశారు. బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా చూడాలని కోరారు.యాదవ కుటుంబం పై జరిగిన అన్యాయాన్ని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.అనంతరం ప్రత్తిపాడు మండల అధ్యక్షులు గోళ్ల కాంతి సుధాకర్, పెద్దాపురం డిఎస్పీ, సుంకర మురళీ మోహన్,సిఐ కిషోర్ బాబు, ఎస్ ఐ సుధాకర్ లను కలిసి వినతపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో గొర్ల మాణిక్యం, వెలుగు బాబ్జీ, దేవర శ్రీరామ్మూర్తి,నైదాన రఘు,నేమాల శ్రీనివాసరావు, ఈగల శ్రీనివాసరావు,వమ్మి గంగరాజు,గొర్ల వెంకట రమణ, గొంప శివ కుమార్, ముచ్చి అప్పలరాజు,తదితర యాదవ నేతలు పాల్గొన్నారు.