డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై టిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలపై ఖండన

0
24

*బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధుల మీడియా సమావేశం*

*బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై టిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలపై ఖండన*


హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:

*మీడియా సమావేశంలో ప్రధానమైన డిమాండ్స్*

1. డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నికార్సైన అంబేద్కర్ వాది. బహుజనులను రాజ్యాధికారం దిశగా నడిపించేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడి, వ్యక్తిగతంగా టిఆర్ఎస్ నేతలు మాటల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

2. డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కు సొంత ఇల్లు లేదు.తన పిల్లలకు రిజర్వేషన్స్ తొలగించిన త్యాగశీలి. ఆరున్నరేళ్ల ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిన త్యాగధనుడిపై టిఆర్ఎస్ పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

3. డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నత స్థాయి ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి డా.బి.ఆర్ అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరామ్ మార్గంలో బహుజనవాదం బలపరిచేందుకు బీఎస్పీలో చేరితే టిఆర్ఎస్ నేతలకు ఎందుకింత భయం.
గడీల పాలన అంతమవుతుందనే భయమా?

4. డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ గ్రామస్థాయిలో బలోపేతాన్ని చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ చెంచాలతో డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యక్తిగతంగా,అసత్య ఆరోపణలు చేయించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం.

5. తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన సాగరహారం పూర్తిగా విద్యార్థి,ఉద్యోగ,రాజకీయ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. దీనికి నాయకత్వం వహించింది ఆ జేఏసీల ఛైర్మెన్ లు. సాగరహారానికి కేసీఆర్ కు సంబంధం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలపరిచే అన్ని రాజకీయ పార్టీల వలనే టిఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. ఇది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమం కానే కాదు.వాళ్ల పార్టీ కార్యక్రమం అంతకంటే కాదు.కేటీఆర్ చేసిన ట్విట్టర్ కామెంట్ పూర్తిగా అబద్ధం, చరిత్రను వక్రీకరించే అంశంగా బీఎస్పీ భావిస్తుంది. కేటీఆర్ ట్విట్టర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీఎస్పీ ప్రధాన డిమాండ్.

6. డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై అసత్య ఆరోపణలు  చేసే టిఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్! తస్మాత్ జాగ్రత్త.బహుజనులు తమ ఓటుతో గడీల పాలనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.ఇక కాచుకోండి.

7. టిఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రం పూర్తిగా అవినీతి పాలైంది. దేశ హోంమంత్రి అమిత్ షా స్వయంగా కేసిఆర్ అవినీతి పాలనను ఉద్దేశించి భవిష్యత్తులో  తెలంగాణ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పిన చరిత్ర కేసీఆర్ ది.

8.లక్షల కోట్ల కాళేశ్వరం కుంభకోణం,ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఐటీ దాడులు జరుగుతున్నాయంటే కేసీఆర్ పాలన ఎలా ఉందో చూసి టిఆర్ఎస్ నేతలారా సిగ్గుపడండి.

9.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ పై వచ్చిన ఆరోపణలు నిజం కావా? ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని బీఎస్పీ డిమాండ్ చేస్తుంది.

10. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి, అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు బెంబేలెత్తిన కేసీఆర్ బిజెపితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు.ఇది నిజం కాదా? ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలి?. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచేందుకు చేసే కుట్రలో
భాగంగానే నిజాయితీగల నాయకుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై టిఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది గర్హనీయం.

11.బిజెపి,టీఆర్ఎస్ నేతలు కలిసి ఆడుతున్న రాజకీయ నాటకాలను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి,టిఆర్ఎస్ పాలనను అంతం చేయడమే బీఎస్పీ లక్ష్యం.

12. 2023 లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. 85% ఉన్న బహుజనులను ఆధిపత్య పార్టీలైన కాంగ్రెస్,బిజెపి,టిఆర్ఎస్ పార్టీలు ఇంతకాలం చేసిన మోసం బహుజన సమాజం పసిగట్టింది. ఇక ఎవరి చేతిలో బహుజనులు మోసపోవడానికి సిద్ధంగా లేరు.   మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్,బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం.


బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధులు:

డాక్టర్ వెంకటేష్ చౌహన్
-9550553182
డాక్టర్ సాంబశివ గౌడ్
9666654929
కే అరుణ క్వీన్-9652177142