జెసిఐ ఇందూరు ఆధ్వర్యంలో రక్తదానo

0
19

జెసిఐ ఇందూరు ఆధ్వర్యంలో రక్తదానo..

హ్యూమన్ రైట్స్ న్యూస్/నిజామాబాద్: జే సి ఐ ఇందూరు (జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ) ఆధ్వర్యంలో రక్త దాన కార్యక్రమాన్ని నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ లో నిర్వహించినట్లు జెసి వీక్ చైర్మన్ కర్క రమేష్, జెసిఐ ఇందూరు జిల్లా అధ్యక్షులు యాదేశ్ గౌడ్ తెలిపారు. శనివారం రెడ్ క్రాస్ లో జేసిఐ ఇందూరు, విశ్వతేజస్ సంయుక్త ఆధ్వర్యంలో 13 మంది సభ్యులు రక్త దానం చేసామని, అనంతరం 94 సార్లు రక్త దానం చేసిన కోటగిరి చంద్రశేఖర్, 35 సార్లు రక్త దానం చేసిన పూర్వ అధ్యక్షులు బంగారు వీర బ్రహ్మo, రెడ్ క్రాస్ సెక్రెటరీ తోట రాజశేఖర్ లకు లకు సన్మానించామని తెలిపారు. కార్యక్రమంలో పెందోటి చంద్రశేఖర్, శ్రీనివాస్ శంకర్, అరుణ్, రాజశేఖర్, ప్రవీణ్, వెంకటేష్, నవీన్, మచెందర్, రవి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.