జీజస్ లవ్స్ మినిస్ట్రీస్ ద్వారా నీళ్ల ట్యాంకు ప్రారంభోత్సవం

0
79

ఆంధ్రప్రదేశ్ / ప్రకాశం జిల్లా/ హ్యూమన్ రైట్ టుడే న్యూస్ ప్రతినిధి

దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామ పంచాయతీ లోని చెంచుగూడెము నందు జీజస్ లవ్స్ మినిస్ట్రీస్ సొసైటీ వారి ద్వారా డీప్ బోర్ వేయించి మోటర్ బిగించి ప్రెజర్ లైన్ ద్వారా నీళ్ల ట్యాంకి కి నీళ్లు అందించడం జరిగిందని జీజస్ లవ్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవ.డాక్టర్ గుర్రం.శేఖర్ తెలియజేయడం జరిగింది.సెప్టెంబర్ మాసంలో గూడెం లోని గిరిజనులు నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నామని జీజస్ లవ్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే డైరెక్టర్ గారు బొమ్మలాపురం చెంచుగూడెమును దర్శించి గిరిజనుల యొక్క సమస్యలు తెలుసుకొనగా వారు "మంచినీటి సమస్య గురించి ప్రస్థావించడం" జరిగింది.వెంటనే జె.ఎల్. యమ్ డైరెక్టర్ గారు స్పందించి అక్టోబర్ మాసంలో గిరిజనుల కొరకు డీప్ బోర్ వేయించడం జరిగింది.గిరిజనుల కొరకు మంచినీటి ట్యాంకు ని కట్టించి ఈరోజు దోర్నాల మండల జడ్పీటీసీ శ్రీమతి లతా బాయ్ మరియు బొమ్మలాపురం పంచాయతీ సెక్రటరీ శ్రీమతి సంధ్యాకుమారి,ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సన్నిధి.కిషోర్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీటిసి శ్రీమతి లతాబాయ్ మాట్లాడుతూ ఈ వెనుకబడిన గిరిజన ప్రజలకు దాహార్తిని తీర్చిన జీజస్ లవ్స్ మినిస్ట్రీస్ సొసైటీ వారిని అభినందించడం జరిగింది.గ్రామ పంచాయతీ సెక్రటరీ సంధ్యాకుమారి మాట్లాడుతూ ప్రజలందరు నీటిని వ్యర్థపరచకుండా నీటిని సక్రమంగా వాడుకోవాలని సూచించడం జరిగింది.ప్రధానోపాధ్యాయులు సన్నిధి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ జీజస్ లవ్స్ మినిస్ట్రీస్ వారు ఈ గ్రామంలో మంచినీటి బోర్ వేసి నీళ్లట్యాంక్ నిర్మించినందుకు తన సంతోషమును వ్యక్తపరచి బోర్ వేసిన సొసైటీ ని అభినందించారు.జీజస్ లవ్స్ మినిస్ట్రీస్ ట్రెజరర్ బెన్ని సునీతారూత్ మాట్లాడుతూ చెంచు కాలనీ లోని మహిళలు చైతన్య వంతులు అవ్వాలనీ, ప్రతి గిరిజన మహిళ పొదుపు గ్రూపులలో ఉండాలని ప్రభుత్వం అందించే ప్రతి పథకమును పొందుకోవాలని వారికి తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జీజస్ లవ్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవ.డాక్టర్ గుర్రం.శేఖర్ మాట్లాడుతూ ఈ గ్రామ గిరిజనులకు బోర్ వేసి మరియు నీళ్ల ట్యాంక్ ని కట్టించి గిరిజనుల దాహార్తిని తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ పిల్లలను బడికి పంపించాలని అలాగే ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉపయోగించుకొని అభివృద్ధి పథంలో నడవాలని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సింగా.ఏసన్న, జె.ఎల్ యమ్ సిబ్బంది పూర్ణకంటి.జేమ్స్, బి.డెన్ని సుప్రశాంత్, బి.దిలీప్ కుమార్, వై.ప్రేమన్న, టి.సురేష్, కె. డేవిడ్ రాజ్, బి.ప్రభుదాసు, యస్.యేసుదానం మరియు చెంచు గూడెం పెద్దలు మరియు గిరిజనులు పాల్గొనడం జరిగింది.