జలదిగ్భంధంలో లోతట్టు గ్రామాలు

0
15

ముంపు మండలాల్లో మూసుకుపోతున్న రహదారులు.

గంట గంటకి పెరుగుతున్న శబరి గోదావరి నదుల ప్రవాహం.

హ్యూమన్ రైట్స్ న్యూస్ /ఆంధ్రప్రదేశ్/అల్లూరి సీతారామరాజు జిల్లా: రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్, కాళేశ్వరం, ఏటూరునాగారం, తాలిపేరు ప్రాజెక్టు లలో వరద నీరు నిండుకుండలా మారింది. గోదారి ఎగువ నుండి వస్తున్న ప్రవాహానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 43.9 అడుగులకు చేరగా చింతూరు శబరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతూ 32 అడుగులకు చేరడంతో శబరి ఉపనదులు వాగులు వంకలు య పోటుతో సోకిలేరు వాగు చంద్రవంక, చీకటి వాగు, కుయుగురు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కుయుగురు వాగు ప్రవాహంతో రోడ్డు మూసుకుపోవడంతో ఒడిస్సా ఆంధ్ర కు రవాణా సౌకర్యానికి ఆటంకం ఏర్పడింది. సుమారు 15 గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. చీకటి వాగు ఉప్పొంగడంతో చుట్టూరు, నర్సింగ పేట, ముకునూరు, ఉలు మూరు, మల్లెతోట, జల్లి వారి గూడెం గ్రామాలకు రహదారులు మూసుకుపోయాయి. కూనవరం వద్ద శబరి నీటిమట్టం 39 అడుగులకు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులు తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటనతో ముంపు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. జులై ఆగస్టు నెలల్లో సంభవించిన వరదల నుండి ఇంకా తేరుకోకముందే మరలా వరదలు ముంచుకొస్తున్న తరుణంలో నిర్వాసితులు సురక్షిత ప్రాంతాలకు వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తుఫాను ముసురు వరద ముంపు తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.