జర్నలిస్టులకు అర్హత మేరకు అక్రెడిటేషన్ లు జారీ

0
42

*జర్నలిస్టులకు అర్హత మేరకు అక్రెడిటేషన్ లు జారీ*

*జిల్లా కలెక్టర్ కె. శశాంక*

*మహబూబాబాద్, హ్యూమన్ రైట్స్ టుడే: జిల్లాలోని జర్నలిస్టులకు అర్హత మేరకు అక్రెడిటేషన్ లు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక మీడియా అక్రెడిటేషన్ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వివిధ కేటగిరీ లలో ఎంపనల్మెంట్ ప్రకారం అక్రెడిటేషన్ మంజూరు చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత మేరకు జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లను వివిధ కేటగిరీ లలో మంజూరు చేయడం జరిగిందని, ఇది నిరంతర ప్రక్రియ అని, మొదటి జాబితా తోనే పూర్తి అయిందని భావించరాదు అని తెలిపారు. నిరంతర ప్రక్రియ అయినందున పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి వచ్చిన దరఖాస్తులను మంజూరు చేయనున్నట్లు, సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కొన్ని టెక్నికల్ కారణాలు వలన మండల స్థాయి విలేఖరులు జిల్లా, నియోజక వర్గంలో దరఖాస్తు చేసుకున్న పక్షంలో అట్టి దరఖాస్తుల విషయమై సమస్యలను పరిష్కరించ నున్నట్లు తెలిపారు. విద్యార్హత, అనుభవ ద్రువపత్రాలు అప్లోడ్ చేయని దరఖాస్తుల విషయమై అవకాశం కల్పించినట్లు, సంబంధించిన పత్రాల జీరాక్స్ ప్రతులు నేరుగా డి.పి.ఆర్. ఓ.కు అందించాలని తెలిపారు. ఇండిపెండెంట్ దరఖాస్తుల విషయమై 12 లేటెస్ట్ ఆర్టికల్స్ సమర్పించాలని, 25 సంవత్సరాల అనుభవం అర్హత ఉన్న వారు ధృవీకరణ పత్రాలు సమర్పించాలని తెలిపారు.

ఏమైనా సందేహాలు ఉంటే డి.పి.ఆర్.ఓను కలిసి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.

ఈ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు సి.హెచ్.శ్రీనివాస్, ఎం. గుట్టయ్య, శ్రీహారి, జి.రాం ప్రసాద్, మురళి, డి.పి.ఆర్. ఓ. ఎం.డి. అయూబ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.