చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం..

0
32

ఆంధ్రప్రదేశ్ / కోనసీమ జిల్లా /మండపేట/
హ్యూమన్ రైట్స్ న్యూస్ టుడే:-

రాష్ట్రంలో చేనేత కార్మికులకు చేనేత పనులను మెరుగుపరిచేందుకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథక యొక్క ముఖ్య లక్షమని మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. శుక్రవారం కపిలేశ్వరపురం మండలం నేలటూరులో చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ,మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి, పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన విధంగా చేనేతల కార్మికులు బాధలు చూసి ప్రతి ఏటా సొంత మగ్గాలు ఉన్న నేతన్న కార్మికుల బ్యాంకుల్లో రూ.24 వేలు నేరుగా జమ చేస్తున్నారని, ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారునికి రూ. 1.20లక్షల మొత్తం సహాయాన్ని అందుతుందన్నారు. కుల మత వర్గ రాజకీయ పార్టీలకు అతీతంగా లంచాలు వివక్షత, పక్షపాతానికి తావు లేకుండా సొంత మగ్గం ఉన్న అర్హులందరికీ సంతృప్తి లబ్ధి పొందేలా నేతన్నల ఆర్థిక అభివృద్ధి జీవన ప్రమాణాలు పెంచడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. నేలటూరుకు సంబంధించి 223 మందికి సుమారుగా 53 లక్షల 52 వేల రుపాయలు ప్రతి ఒక్క నేతన్నకు అకౌంట్లో డబ్బులు పడినాయని అన్నారు.. మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ దుర్గరాణి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా నేతలకు లబ్ధి కూర్చే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అర్హులై సొంత మగ్గం కలిగి ప్రతి కుటుంబానికి ఏడాది రూ .24 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.. అనంతరం నేతన్న కార్మికులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ను షాలువాతో పూలమాలతో సత్కారంచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత సొసైటీ చైర్మన్ చల్లా వీర వెంకట సత్యనారాయణ, రెడ్డి రాజాబాబు మున్సిపల్ కోఆప్షన్ మెంబర్, కర్రీ పాపారాయుడు రాష్ట్ర కార్యదర్శి, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, ఎంపీటీసీ రుద్రాక్షల వీర గౌరి కుమారి కుక్కల వీరన్న గ్రామ సర్పంచ్, వైస్ ప్రెసిడెంట్ శెనక్కాయల దొరబాబు, ఎంపీటీసీలు ఉప సర్పంచ్ లు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.