చింతపల్లి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గోడ్డేటి దేముడు గారి 7 వర్ధంతి

0
33

ఆంధ్రప్రదేశ్/ అల్లూరి సీతారామరాజు జిల్లా/ చింతపల్లి మండలం/ హ్యూమన్ రైట్స్ న్యూస్ టుడే/ స్టాఫ్ రిపోర్టర్ బి లోకేష్/

చింతపల్లి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గోడ్డేటి దేముడు గారి 7 వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు కొయ్యూరు మండలం శరభన్నపాలెం పంచాయితీ స్వగ్రామమైన వెలగల పాలెంలో కుటుంబ సభ్యులు కామ్రేడ్ దేముడు గారి ఘాట్ వద్ద అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి శివప్రసాద్ దంపతులు పూలమాల వేసి వివిధ పార్టీల నాయకులుఅభిమానులు మధ్యన వర్ధంతి వేడుకలు అరకు ఎంపి శ్రీమతి గొడ్డేటి మాధవి గారు మాట్లాడుతూ
స్వర్గీయ మా తండ్రి గారైన గొడ్డేటి దేముడు గారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ ఆదివాసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని నాన్నగారు 1994 నుండి ఆయన చివరి శ్వాస వరకు గిరి ప్రజలకు అనేక సేవలందించారని ప్రజల్లో ఆయనకున్న ఆదరణయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న ఏరి కోరి మరి మీ ముందుకు ఒక ఎంపీ అభ్యర్థిగా నన్ను నిలబెట్టి పార్లమెంట్లో కూర్చోబెట్టారు అంటే కేవలం అది నాన్నగారికి ప్రజల్లో ఆదరణ మంచితనమే అని అన్నారు నాన్న గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని తెలిపారు అనంతరం మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ శతక బుల్లి బాబు గారు కొయ్యూరు జడ్పిటిసి వార నూకరాజు గారు శరబన్నపాలెం సర్పంచ్ సత్యనారాయణ ఎంపీటీసీ బిడిజన అప్పారావు,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కూడా సింహాచలం యువనేత గొడ్డేటి మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఆత్మీయులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.