చరిత్రలో తొలిసారి ఆర్.ఎస్.ఎస్ కార్యాలయం ముట్టడి

0
88

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆర్ఎస్ఎస్ ను ఓ తీవ్రవాద సంస్థగా గుర్తించాయి


చరిత్రలో తొలిసారిగా ఆర్.ఎస్.ఎస్ కార్యాలయం ముట్టడి

హ్యూమన్ రైట్స్ టుడే/నెట్వర్క్: కుల వ్యవస్థ పోషకులు, అసమాన వ్యవస్థ సమర్థకులు, కుట్ర కుతంత్రాలకు పుట్టినిల్లు, ప్రాణాంతక మతోన్మాదానికి కేంద్రమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనేది జగమెరిగిన సత్యం. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆర్ఎస్ఎస్ ను ఓ తీవ్రవాద సంస్థగా గుర్తించాయి. ఇండియాలో బహుసాంఖ్యక ప్రజల పాలిట అది ఓ శాపంగా మారింది. వర్తమానంలో దాని విచ్చినకర కార్యకలాపాలకు ఓ అడ్డుఅదుపు లేకుండా పోయిందని భారతీయులు వాపోతున్నారు. నేడు ప్రజల ఆక్రోశానికి అట్టి ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముట్టడికి గురైంది. ఇండియా చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి సరైన శుభ పరిణామాలు జరిగాయని బయటి ప్రపంచమంత హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ ముక్తి మోర్చా, బాంసెఫ్ సుప్రీమో మాన్యులు వామన్ మెశ్రం పిలుపు మేరకు గురువారం ఉదయం మహారాష్ట్ర నాగపూర్లోని దాని హెడ్ క్వార్టర్స్ పై మూలనివాసులు భారీ ఊరేగింపు తీసి ముట్టడించే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో దానికి నాయకత్వం వహిస్తున్న మెశ్రంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెశ్రం అక్రమ అరెస్టుకు నిరసన తెల్పిన నగరవాసుల్ని కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేసి తరలించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం తమ వాక్ స్వాతంత్ర్యన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరించాయని బహుజన కార్యకర్తలు మండిపడ్డారు. బ్రాహ్మణ బగావ్ దేశ్ బచావ్, ఇది అంతం కాదు ఆరంభం, దేశ్ భక్తి ఆందోళన్ జారీ రెహెగా, దేశ మూలవాసుల జాతీయ నాయకున్ని బేషరతుగా విడుదల చేయాలని నాగపూరాంత పిక్కెటిల్లే నినాదాలతో మారుమోగింది. ఈ చారిత్రాత్మక ఉద్యమంలో దేశ నలుమూలల నుంచి, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలు భారీ మోతాదులో పాల్గొనడం రాష్ట్రం గర్వించదగ్గ విషయమని చర్చా సాగుతోంది.