గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో నెహ్రూ యువ కేంద్ర ఆవిర్భావ దినోత్సవం

0
92

ఆంధ్రప్రదేశ్/అన్నమయ్య జిల్లా/రైల్వే కోడూరు మండలం/హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి

నెహ్రూ యువ కేంద్ర కడప వారి సహకారంతో స్థానిక గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురుదేవ వశిష్ట జూనియర్ కాలేజీ నందు విద్యార్థులకు సెల్ ఫోన్ వాడకం వలన జరుగు అనర్ధాలపై వకృత్వ పోటీలు నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ వై రమేష్ మాట్లాడుతూ సెల్ ఫోన్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయిందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా సెల్ ఫోన్ ను వినియోగించాలన్నారు. ఎక్కువ సమయం సెల్ ఫోన్ వాడుతూ యువత ఫిజికల్ గా క్రీడలు ఆడుటకు ఉత్సాహం చూపడం లేదన్నారు, ఇది చాలా ప్రమాద మని జనవరిలో మన కళాశాల విద్యార్థులందరికీ ఘనంగా క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
విద్యార్థులు చదువుపై భవిష్యత్తుపై నిర్దిష్ట లక్ష్యాలను కలిగి ఉండాలన్నారు.
గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ కే పార్థసారథి మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర వారి ద్వారా యువతకు క్రీడా కార్యక్రమాలలో ప్రోత్సాహం, యువజన సంఘాలు ఏర్పాటు చేయడంలో సహకారం అదేవిధంగా జిల్లా కేంద్రాలలో యూత్ హాస్టల్ నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
వకృత్వ పోటీలలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో మొబైల్ యాప్ ల ద్వారా యువత రుణాలు పొందుటకు ఆసక్తి చూపిస్తున్నారని తర్వాత వారి చేతిలో మోసపోయి వేధింపులతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలన్నారు అమ్మాయిలు ఫోన్లో ద్వారా వ్యక్తిగత సమాచారం ఫోటోలు షేర్ చేయకూడదు అన్నారు మొబైల్ ఫోన్ అధిక వాడకం వలన రేడియేషన్ పెరిగి పక్షులు చనిపోవడం ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలు జరగడం సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోవడం ఆన్లైన్ గేమ్స్ వ్యసనం అవ్వడం కుటుంబంతో సమాజంతో మన లేకపోవడం వంటి అనర్ధాలు జరుగుతున్నాయని అదేవిధంగా గూగుల్ ద్వారా మనకు తెలియని సమాచారం సమస్తము తెలుసుకోవడం విజ్ఞానం పెంచుకోవడం వంటి ఉపయోగాలు కూడా ఉన్నాయని వివరించారు అనంతరం వకృత్వ పోటీలలో విజేతలకు మేమంటోలు సర్టిఫికెట్లు అందజేశారు కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు ట్రస్ట్ కోఆర్డినేటర్లు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.