గూడూరు మండల కేంద్రంలో వీఆర్ఏల బైక్ ర్యాలీతో మహా ధర్నా

0
492

హ్యూమన్ రైట్స్ టుడే / గూడూరు: గురువారం VRA ల 46 వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా VRA ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గూడూరు మండల కేంద్రంలో వీఆర్ఏల బైక్ ర్యాలీతో మహా ధర్నా నిర్వహించారు. గూడూరు మండల కేంద్రంలో VRA JAC జిల్లా కో-కన్వీనర్ దారావతు జుంకిలాల్ ఆధ్వర్యంలో VRA లు బైక్ ర్యాలీతో పాఖాల వాగు బ్రిడ్జి నుండి వయా భరత్ పెట్రోల్ బ్యాంకు మీదిగా తహశీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించి మహా ధర్నా నిర్వహించడం జరిగినది. VRA ల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించని వెడల ఉద్యమాన్ని ఉదృత్వం చేస్తామని హెచ్చరించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో VRA JAC జిల్లా చైర్మన్ బెజ్జం భరత్ కుమార్ కో-చైర్మన్ కూరాకుల శ్రీవాత్సవ ప్రధాన కార్యదర్శి దూకుంట్ల శ్రీనివాస్ రావు కన్వీనర్ ప్రభాకర్ మండల చైర్మన్ పడిగె శ్రీను, కో-చైర్మన్ దారావత్ రవి ప్రధాన కార్యదర్శి అల్లాడి శ్రీనివాస్, స్నేహలత, వసంత, జ్యోతి, రాములు, నరేష్, విష్ణు, సాంబయ్య,మరియు 16 మండల vra లు పాల్గొన్నారు. అనంతరం కొత్తగూడ మండలంనకు వెళ్లుతూ గుంజేడు ముసలమ్మ దేవతను దర్శించుకొని మా సమస్యలు వెంటనే G. O. ల రూపంలో విడుదల అయే విధంగా దీవించు అని మొక్కుకోవడం జరిగినది.