క్షేత్రస్థాయిలో కౌలు రైతుల సమీకరణ

0
32

ఆంధ్ర ప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు / హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి

జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహాసభను వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో నిర్వహించేందుకు గతంలో తేదీని ఖరారు చేసిన కవులు రైతు సంఘం నాయకులు సోమవారం మండలంలోని పలు గ్రామాలు సందర్శించి కౌలు రైతులు పడుతున్న బాధలను ఇబ్బందులను అడిగి తెలుసుకునేందుకు ఆయా గ్రామాల్లో కౌలు రైతులు పడుతున్న అనేక ఇబ్బందులను అడిగి తెలుసుకుని 18 వ తారీకు జరుగుతున్నటువంటి మహాసభలో చర్చించేందుకు అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు అనేక విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అధిక సంఖ్యలో కౌలు రైతులు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కౌలు రైతులను కౌలు రైతు సంఘం నాయకులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌలు సంఘం నాయకులు పిచ్చేశ్వరరావు చాట్ల రవి మహమ్మద్ లాల్ గౌస్ తదితర నాయకులు పాల్గొన్నారు.