కోటలో ట్రాఫిక్‌ కష్టాలు తీరేదెప్పుడో కోటలోట్రాఫిక్‌ కష్టాలు అవస్థలుపడుతున్న ప్రజలు

0
21

ఆంధ్రప్రదేశ్/తిరుపతి జిల్లా/హ్యుమన్ రైట్స్ టుడే/కోట మండల ప్రతినిధి

కోటలో ట్రాఫిక్‌ కష్టాలు తీరేదెప్పుడో కోటలోట్రాఫిక్‌ కష్టాలు-అవస్థలుపడుతున్న ప్రజలు రోడ్డుపైనే వాహనాల పార్కింగ్‌ రహదారికి ఇరువైపులా వ్యాపారాలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఆక్రమణలతో కూచించుకుపోతున్న రోడ్లు
గుంటల మయంగా కోట రోడ్లు
బురద రోడ్లపై నడకసాగిస్తూ ఇబ్బందులు పడుతున్న ప్రజలు కోట రోడ్లపై అధికారులు కాస్తా దృష్టి సారించండి
పండుగలు వస్తున్నాయ్-ట్రాఫిక్ కష్టాలు తీర్చాలి
తిరుపతి జిల్లా కలెక్టర్,ఆర్డీవో, ఆర్& బి ఈ ఈ,జిల్లా ఎస్పీ లకు కోట ప్రజలు వేడుకోలు ట్రాఫిక్ సమస్యల పై చర్యలు తీసుకుంటాం:ఎస్సై పుల్లారావు మండలకేంద్రమైన కోటలో ట్రాఫిక్‌ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. మండలకేంద్రానికి నిత్యం వేల మంది ప్రజలు, వాహనదారులు పలు పనుల నిమిత్తం రోజూ వస్తుంటారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. షాపులకు వెళ్లే ప్రజలు వా హనాలను రోడ్డుపైనే నిలపడంతో ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్నారు. మండలకేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా పోలీస్‌ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి తగు చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు రోడ్డెక్కుతున్న వ్యాపారాలు
ప్రధానమైన రోడ్లను అక్రమించి వ్యాపారం చేస్తున్నారు. పోటీపడి వ్యాపారాన్ని రోడ్డుపైకి తెచ్చారు. దీంతో అక్కడ నిలపాల్సిన వాహనాలను రోడ్డు మధ్యలో నిలపాల్సి వస్తు న్నది. పండుగలు,పార్టీ మీటింగ్ లు, ఉత్సవాలు జరిగేటప్పుడు ట్రాఫిక్‌ ఎక్కువ ఉండడంతో ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఉండడంతో నిత్యం ప్రజలు, విద్యార్థులు మండలకేంద్రానికి వస్తుండడంతో రోడ్డుపై వెళ్లే వాహనాలను రోడ్లకు ఇరువైపులా పార్కింగ్‌ చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇ ప్పటికైనా పోలీసులు స్పందించి ప్రతీ రోజూ కొంతమంది కానిస్టేబుల్‌ లనూ నియమించాలని మండల ప్రజలు, వాహనదారులు కో రుతున్నారు.ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలి కోటలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రధాన సెంటర్లలో రోడ్డుపైనే వాహనాలను నిలుపుతున్నారు. దీంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్నది. నిబంధనలు పాటించని వ్యాపారస్తులు, వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకొని ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూడాలి అనీ కోట ప్రజలు కోరుకుంటున్నారు.కోటలో ట్రాఫిక్ సమస్యలకు ఆక్రమణలు తొలగింపే మార్గం కోట క్రాస్ రోడ్డు వద్ద నుండి వయా కోట ఆర్టీసీ, గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా కొక్కుపాడు రోడ్డు వరకు రోడ్లు ఆక్రమణకు గురికావడం,డ్రైనేజీ కాలువలను సైతం ఆక్రమణ చేయడం, ఆక్రమణలు చేసిన స్థలాల్లో వ్యాపాస్తులు ఎత్తుఅయిన కట్టడాలు కట్టడంతో రోడ్ల పై వర్షం నీరు, డ్రైనేజీ నీరు చేరడంతో వాహనాల రాకపోకలు వల్ల రోడ్లు గుంటల మయంగా మారడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అఖిలపక్షం సమావేశం త్వరగా పెట్టాలి
కోట పట్టణంలో ఆక్రమణలు తొలగించే పక్రియలో భాగంగా గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ అఖిలపక్షం సమావేశం నిర్వహించి అందరి ఆమోదయోగంతో కోట పట్టణంలో ఆక్రమణలు తొలగిస్తామని ఇటీవల వెల్లడించారు.ప్రస్తుతంవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలు తగ్గిన వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టి త్వరగా ఆక్రమణలు తొలగించి కోటలో ట్రాఫిక్ సమస్యలతో పాటు రోడ్లు నిర్మాణం చేపట్టి కోటను అభివృద్ధి చేయాలి అనీ కోట ప్రజలు ఆర్డీవో ను కోరుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం.
మండలకేంద్రం కోటలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డుపై వాహనాలు నిలిపే వాహనదారులపై, రోడ్డును అక్రమించి వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకొని జరి మానాలు వేస్తున్నాం. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తే జరిమానాలు వేయడంతోపాటు కేసులు నమోదు చేస్తాం.