కాంగ్రెస్ పార్టీలో మనుషులకి పింఛన్ రాదట

0
186

కాంగ్రెస్ మనుషులకి పింఛన్ రాదు

బలపాల గ్రామంలో బాధితురాలు ఆవేదన

హ్యూమన్ రైట్స్ న్యూస్ టుడే/కురవి/నవంబర్22 : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామనికి చెందిన నామ అనుసూర్య కు వృద్ధాప్యం పింఛన్ కింద ప్రభుత్వం జారీ చేసిన కార్డు అందచేశారు. కాని కార్డు అందిన ఆనందం ఆమేకు ఎంతో సేపు నిలవలేదు కార్డు వచ్చింది కానీ నెంబర్ రాలేదు అని మీరు కాంగ్రెస్ పార్టీ కి చెందిన మనుషులు కాబట్టి మీకు పించన్ రాదు టీఆర్ఎస్ నాయకులు అన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం అసరా పించన్లు ద్వారా నా వయసు దృష్టిలో పెట్టుకొని వృద్ధాప్యం పించన్ కార్డు స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ చేతులమీదుగా రాజోల్ గ్రామంలో అందచేశారని నాతో పాటు కార్డు తీసుకున్న వారందరికీ డబ్బులు వచ్చాయి. నాకు మాత్రం రాలేదు అని ఈ విషయం పై గ్రామంలో ఉన్న నాయకులను నిలదీయగా మీరు కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తారు అని మీకు పించన్ డబ్బులు రావు అనడంతో మాకు జరిగిన అన్యాయం గురించి అదికారుల చుట్టూ పలుమార్లు తిరిగిన ఎవరు పట్టించుకోలేదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు రావాల్సిన పించన్ డబ్బులు అందేలా చూడాలని వేడుకుంటున్నారు.