ఎస్సీ వర్గీకరణ కోసం యం యస్ ఫ్ మహాదీక్ష

0
39

ఆంధ్ర ప్రదేశ్/నంద్యాల జిల్లా బనగానపల్లె హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి :

పెద్ద మునయ్య మాదిగ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట మహాదీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం తమ అధికారంలో వచ్చిన వెంటనే వందరోజుల్లోపు ఎస్సీ వర్గీకరణ చేస్తామని నమ్మబలికి ఎస్సీలోని 59 కులాలను నమ్మించి ఓట్లు వేయించుకున్న కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు అవుతున్న కూడా ఎస్సీ వర్గీకరణ పై నిర్లక్ష్యంగా ఉందని ఈ నిర్లక్ష్యానికి నిరసనగా జరుగుతున్న దీక్షలో ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ కొలిమిగుండ్ల ఇంచార్జ్ నాగేశ్వరరావు మాదిగ, కోయిలకుంట్ల మండల ఎంఎస్ఎఫ్ ఇన్చార్జి ఓబులేసు మాదిగ , అవుకు మండలం ఎంఎస్ఎఫ్ ఇన్చార్జి సాత్రి బాలరాజు, కోయిలకుంట్ల మద్దిలేటి మాదిగ, బనగానపల్లె మండలం యం అర్ పి ఎస్ నాయకులు పసుపుల ఎర్రన్న , మిద్దె రామకృష్ణ , పసుపుల నాగన్న, యాగంటి పల్లె మధు మొదలగు వారు పాల్గొన్నారు.