ఉపాధ్యాయులు పట్టభద్రులు ఓటు కొరకు పేరు నమోదు చేసుకోండి

0
18

ఆంధ్రప్రదేశ్/ నంద్యాల జిల్లా/బనగానపల్లి/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి :

ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి మాధవ స్వామి రానున్న పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నిక కోసం ఉపాధ్యాయులు పట్టభద్రులు అధ్యాపకులు ప్రతి ఒక్కరు ఓటు కొరకు మీ పేరును నమోదు చేసుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి మాధవ స్వామి కోరారు పేరు నమోదు కొరకు చివరి తేదీ నవంబర్ 7వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని కోరారు అక్టోబర్ 31 నాటికి ఉన్నత పాఠశాలలో కళాశాలలో యూనివర్సిటీలలో ఆరు సంవత్సరాల కాలంలో మినిమం మూడు సంవత్సరాల కాలం పనిచేసిన ఉపాధ్యాయులు అధ్యాపకులు లెక్చరర్స్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటు వేయడానికి పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు పట్టభద్రులు గత ఆరు సంవత్సరాల లో డిగ్రీ పూర్తి చేసిన వారై ఉండాలని తెలిపారు ఓటు హక్కు పొందిన తర్వాత తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు బనగానపల్లె డివిజన్ స్థాయి ఏపీటీఎఫ్ కార్యాలయంలో మండల అధ్యక్షులు జె వెంకట కృష్ణుడు అధ్యక్షతన సమావేశంలో పాల్గొని మాధవస్వామి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు ఎం మధుసూదన్ రావు జిల్లా ఉపాధ్యక్షులు లింగమయ్య రమేష్ ఎల్ల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.