ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి

0
21

ఆంధ్రప్రదేశ్/నంద్యాల జిల్లా/బనగానపల్లె హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి :

బనగానపల్లి పట్టణంలోని ఆర్య వైశ్య భవనం నందు అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి సందర్భంగా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించడం జరిగినది. అనంతరం ఆర్యవైశ్య భవనం నుండి పాత బస్టాండ్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు పాదయాత్రగా వెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది .

అనంతరం ఆర్యవైశ్యులు మాట్లాడుతూ రాష్ట్ర సాధనకై 58 రోజులు నిరాహార దీక్ష చేసి తెలుగువారికి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి పెట్టడం జరిగిందని అలాగే ఆయన స్వాతంత్రం కోసము మహాత్మా గాంధీ వెంట నడిచి మనకు స్వాతంత్రం రావడానికి తోడ్పడినటువంటి గొప్ప వ్యక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య, నల్లగట్ల వెంకటేశ్వర్లు ,నూకల విజయ్ కుమార్, ఎం భరతుడు ,బచ్చు భాస్కర్, గుండా రవి , గుప్తా, కాసుల జంగం, సాయిరాం,బచ్చు మధుసూదన్, బలరాం, బండారు లలిత, లక్ష్మీ, ఆర్యవైశ్య సంఘం మహిళా సభ్యులు తదితర పాల్గొన్నారు.