ఆదివాసి గర్జన బహిరంగ సభను విజయవంతం చేయండి

0
32

ఆంధ్రప్రదేశ్/ అల్లూరి సీతారామరాజు జిల్లా / పాడేరు డివిజన్ ఇంచార్జ్ / హ్యూమన్ రైట్స్ న్యూస్ ప్రతినిధి :

ఆదివాసి జాతికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాట్లాడని ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి

ఆదివాసి జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర డిమాండ్
బోయ వాల్మీకి, ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 30న పాడేరులో జరగనున్న ఆదివాసి గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ రామారావు దొర ఆదివాసులకు పిలుపునిచ్చారు. ఆదివాసి హక్కుల పరిరక్షణ యాత్రలో భాగంగా జీకే వీధి జేఏసీ మండల కన్వీనర్ కొర్ర బలరాం తో కలిసి రెండు రోజుల పాటు మండలంలో పర్యటించిన రామారావు దొర స్థానిక ఆదివాసి ప్రజా ప్రతినిధులు “నోరు ఉండి మాట్లాడలేని చెవులు ఉండి వినలేని కళ్ళు ఉండి చూడలేని” నిస్సహెల్ గాను ఉండబట్టే పాలకులు ఆదివాసి హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, వీరు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ ప్రభుత్వంగా ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ అధికారన్ని నిలబెట్టుకోవడం కోసం ఎస్టీ జాబితాలో బోయాలను చేర్చి ఆదివాసులను బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారని, ఆయాకులాలను చేర్చడానికి జారీ చేసిన 52 జీవోను నియమించిన శ్యామల ఆనంద్ కమీషన్ను తక్షణమే రద్దు చేసుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బోయ వాల్మీకి, వడ్డీ కులాలను ఎస్టీలలో చేర్చితే ఆదిమ జాతుల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని, ఇటీవల కాలంలో అసలైన జాతులను వెబ్ పోర్టల్ నుంచి తొలగించిన ఈ ప్రభుత్వం ఇతర కులాలను ఎస్టీలలో చేర్చడానికి అర్హత లేని, విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాలలో ఆదివాసుల కంటే అభివృద్ధి చెందిన కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. గత టిడిపి ప్రభుత్వం బోయ వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మానం చేసిందని, ఈ రెండు సందర్భాలలో కూడా ఆదివాసి జాతికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్న కనీసం నోరు మెదపని ఆదివాసి ఎమ్మెల్యేలు ” కళ్ళుండి చూడలేని నోరు ఉండి మట్లాడని ఆదివాసి ప్రజాప్రతినిధులు తక్షణమే తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఆదివాసి జేఏసి డిమాండ్ చేస్తుంది.
అంతకుముందు జీకే విధి తహసిల్దార్ గిడ్డి రాజ్ కుమార్ ను కలిసి తమ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నర్, చీఫ్ సెక్రటరీ లకు వినతి పత్రాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ కుర్ర బలరాం, అల్ ఇండియా ఆదివాసి ఉద్యోగుల సమఖ్య రాష్ట్ర కమిటీ సభ్యులు కొర్ర మల్లేశ్వరరావు, ఆల్ ఇండియా ఎస్టి ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ లోచలి రామకృష్ణ, కొర్ర నీలకంఠం, కొర్ర గౌతం, వెచ్చంగి నాని బాబు, రామకృష్ణ, ప్రసాద్, దేవదాసు, దానియేలు, మూర్తి లు పాల్గొన్నారు.