అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

0
17

హ్యూమన్ రైట్స్ న్యూస్ /ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం : కేతవీరునిపాడు గ్రామంలో “గడపగడపకు – మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు. నందిగామ మండలంలోని కేతవీరునిపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు , పేదలకు తోడుండాలనే మంచి మనసున్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని – ఏ కారణం చేతనైనా ఎవరికైనా సంక్షేమ పథకం అందకపోతే, మరలా తిరిగి దరఖాస్తు చేసుకుంటే – నిర్దిష్ట సమయ వ్యవధిలో ఆ దరఖాస్తులు పరిశీలించి వారికి లబ్ధి చేకూరేలా పనిచేసే ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు, వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల ఇళ్ల ముందుకి పరిపాలన తెచ్చిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఎన్నో మంచి పనులు చేస్తూ పేదల హృదయాల్లో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్షాలు – కొన్ని మీడియా చానళ్లు, పత్రికలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ,ప్రజలు అన్ని గమనిస్తున్నారని – రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నెలకుదిటి శిరీష , ఎంపీపీ సుందరమ్మ , జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య , షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేహనాజ్ బేగం, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోనెల సీతారామయ్య ,మండల పార్టీ అధ్యక్షులు శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.