అర్హత కలిగిన జర్నలిస్టులకు నివేశ స్థలాలు కేటాయింపు
ఏమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

0
43

ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు / (జుజ్జూరు) హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్గృహాలు

నిర్మించుకునే వారికి తన వ్యక్తిగత నిధులనుంచి లక్ష రూపాయలు ఇస్తానని హామీ జర్నలిస్టులను సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

వీరులపాడు ప్రెస్ క్లబ్ కార్యాలయానికి తన సొంత నిధుల నుంచి మౌలిక వసతులు కల్పిస్తానని హామీ
హర్షం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు

అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టులకు నివేశ స్థలాలు కేటాయించడంతో పాటు, గృహాలు నిర్మించుకునే వారికి తన సొంత నిధుల నుంచి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తానని శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ విలేకరులకు హామీ ఇచ్చారు
వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని పాత్రికేయులతో కలిసి సోమవారం సాయంత్రం పరిశీలించారు,ప్రెస్ క్లబ్ కార్యాలయానికి కావలసిన మౌలిక వసతులను పాత్రికేయులను అడిగి తెలుసుకున్నారు
అనంతరం ఆయన మాట్లాడుతూ
ప్రెస్ క్లబ్ కార్యాలయానికి కావలసినమౌలిక వసతులకు అయ్యే ఖర్చులను తన సొంత నిధుల నుంచే కేటాయిస్తానని హామీ ఇచ్చారు నందిగామ నియోజకవర్గం లోని పాత్రికేయుల సమస్యలకు అనునిత్యం అండగా ఉంటానని, పాత్రికేయుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ కోటేరు లక్ష్మి, మండల పార్టీ కన్వీనర్ ఆవుల రమేష్ బాబు జడ్పిటిసి సభ్యురాలు అమర్లపూడి కీర్తి సౌజన్య, మాజీ జడ్పిటిసి సభ్యులు కోటేరు ముత్తా రెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, జుజ్జూరు సొసైటీ అధ్యక్షులు పూల రాంబాబు, గ్రామ సర్పంచ్ రామావత్ కోటి పాత్రికేయులు లాల్ మహమ్మద్ గౌస్, అయిలపోగు రవికుమార్, గోపిశెట్టి వరప్రసాద్, అమరా ఉదయభాస్కర్, తాళ్ల శ్రీనివాసరావు , పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.