అనారోగ్యానికి గురైనా గురుకుల పాఠశాల విద్యార్థులు

0
18

విద్యార్థులను పరిశీలించి మందులు అందజేసినా వైద్య సిబ్బంది.

హ్యూమన్ రైట్స్ న్యూస్/హైదరబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని నాగులపల్లి రోడ్డు లో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ స్కూల్లో కొందరు విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు స్టాప్ తో హెల్త్ క్యాంపు నిర్వహించారు. వైద్య సిబ్బంది స్కూల్ విద్యార్థులు కొంతమంది దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని మెడికల్ క్యాంపు నిర్వహించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు స్టాపు మెడికల్ క్యాంపు కండక్ట్ చేసి స్కూలులో ఉన్న 480 మంది బాలికలో ఎవరైతే దగ్గు, జలుబు, జ్వరము తలనొప్పి, కడుపునొప్పి బాడీపెయిన్స్ మరియు కంటి చూపుతో బాధపడుతున్న మొత్తం 107 మంది బాలికలకు జనరల్ చెకప్ చేసి వారిలో 83 మంది వివిధ రకాల ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారికి మందులు అందజేశారు. మిగతా 24 మందికి నేత్ర చికిత్స పరిశీలించి, వారికి కావలసిన మెడిసిన్ అందించడం జరిగిందని వైద్య సిబ్బంది తెలిపారు.