అనారోగ్యంతో ఉన్న మహిళకు ఆర్థిక సహాయం

0
53

ఆంధ్రప్రదేశ్/అన్నమయ్య జిల్లా/రైల్వే కోడూరు మండలం/ హ్యూమన్ రైట్స్ టుడే ప్రతినిధి

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ మండల పరిధిలోని కె బుడుగుంట పల్లి కు చెందిన తిరుపతి వాణి అనే నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ ఇటీవల అనారోగ్యంతో ఉండడంతో, పరిస్థితిని గమనించిన కువైట్ ఇండియన్ వడ్డీ రాజుల సేవాసమితి ద్వారా 32వేల నగదు ఆరోగ్య అవసరాల నిమిత్తం తురక వెంకటసుబ్బయ్య, బత్తల చంద్రమౌళి మరియు లక్ష్మయ్య ల ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో, అనారోగ్యంతో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని వారు అన్నారు. కార్యక్రమంలో కువైట్ ఎన్నారై గజ్జల వారి పల్లి సర్పంచ్ కోటకొండ గోపి ,యామల సిద్ధేశ్వర్, సూర్య ప్రకాష్, బత్తల సుబ్రహ్మణ్యం, బీసీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మల్లెబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.