అక్టోబర్ 2 నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు

0
29

*అక్టోబర్ 2 నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు

హ్యూమన్ రైట్స్ న్యూస్/AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో అక్టోబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం అవుతాయని రిజస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ డీఐజీ శివరాం తెలిపారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే రిజిస్ట్రేషన్, వివాహ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ జారీ, ఈసీల జారీ తదితర సేవలు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. ఏ గ్రామానికి చెందిన వారు అదే గ్రామంలో రిజిస్ట్రేషన్ శాఖ సేవలను పొందొచ్చని వివరించారు.